Share News

ముక్కోణపు సిరీస్: భారత్-ఎతో ఫైనల్.. టాస్ నెగ్గిన శ్రీలంక-ఎ

ABN , Publish Date - Jun 21 , 2026 | 09:57 AM

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

ముక్కోణపు సిరీస్: భారత్-ఎతో ఫైనల్.. టాస్ నెగ్గిన శ్రీలంక-ఎ
India A vs Sri Lanka A

ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంక ప్లేయర్లకు వైభవ్ సూర్యవంశీకి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరి దృష్టి వైభవ్‌పైనే ఉంది. మరోవైపు ఈ సిరీస్‌లో వైభవ్ స్వల్ప పరుగులకే ఔట్ అవుతూ వచ్చాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.


భారత్-ఎ తుది జట్టు:

ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), సూర్యాంశ్ షెడ్గె, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రాజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్

శ్రీలంక-ఎ తుది జట్టు:

నిరోషాన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), అవిష్కా ఫెర్నాండో, నువానిదు ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగే(కెప్టెన్), రవిందు ఫెర్నాండో, వానుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియస్కాంత్, దులాజ్ సముదితా, కుగాతస్ మిథులాన్


ఇవి కూడా చదవండి:

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్

Updated Date - Jun 21 , 2026 | 09:57 AM