ఫిఫా ప్రపంచ కప్: ఐవరీ కోస్ట్‌పై విజయం.. నాకౌట్‌కు జర్మనీ
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:17 AM
ఫిఫా ప్రపంచ కప్‌లో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జర్మనీ జట్టు నాకౌట్ దశలో అడుగుపెట్టింది. ఉత్కంఠ పోరులో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో జర్మనీ ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జర్మనీ జట్టు నాకౌట్ దశలో అడుగుపెట్టింది. ఐవరీ కోస్ట్‌పై జరిగిన ఉత్కంఠ పోరులో 2-1 తేడాతో జర్మనీ ఘన విజయం సాధించింది. దీంతో జర్మనీ సూపర్-32కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో కాస్త తడబడిన జర్మనీ.. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ డెనిజ్ ఉండవ్ రెండు గోల్స్ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు.
2014లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జర్మనీ వరుసగా గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తూ వచ్చింది. 12 ఏళ్ల తర్వాత.. జట్టు కీలక సమయంలో పోరాట స్ఫూర్తిని చాటి నాకౌట్‌కు చేరుకుంది. మ్యాచ్ 30వ నిమిషంలో ఫ్రాంక్ కెస్సీ గోల్‌తో ఐవరీ కోస్ట్ ఆధిక్యంలోకి వెళ్లింది. యువ సంచలనం యాన్ డియోమాండే సృష్టించిన అవకాశాన్ని కెస్సీ గోల్‌గా మలిచాడు. తొలి అర్ధభాగంలో జర్మనీ రెండుసార్లు బంతిని నెట్‌లోకి పంపినా.. ఫౌల్ కారణంగా రిఫరీ ఆ గోల్స్‌ను రద్దు చేశాడు. బ్రేక్ తర్వాత జర్మనీ దూకుడు పెంచింది. తీవ్ర ఒత్తిడితో 68వ నిమిషం వరకు ఐవరీ కోస్ట్ పోరాడినప్పటికీ.. ఉండవ్ దాడికి తలవంచాల్సి వచ్చింది. నదీమ్ అమిరి ఇచ్చిన క్రాస్‌ను ఉండవ్ వాలీతో గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. అనంతరం అదనపు సమయంలో మరో గోల్ సాధించి జర్మనీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో జర్మనీ 2014 తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. మరోవైపు ఐవరీ కోస్ట్‌కు ఇంకా అవకాశాలు మిగిలే ఉన్నాయి. చివరి గ్రూప్ మ్యాచ్‌లో అరంగేట్ర జట్టు కురకావోపై గెలిస్తే తదుపరి దశకు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్