Share News

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్

ABN , Publish Date - Jun 20 , 2026 | 08:42 PM

భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇక నుంచి ‘కమ్‌బ్యాక్ ప్లేయర్’ అనే ముద్ర పడకుండా ఆడాలని స్పష్టం చేశాడు. భారత జట్టులో శాశ్వత సభ్యుడిగా నిలదొక్కుకోవడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్
Ravi Bishnoi

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో చోటు కోల్పోయినప్పటికీ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు సంబంధించిన ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టీ20 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ కెరీర్‌లో ఇక నుంచి ‘కమ్‌బ్యాక్ ప్లేయర్’ అనే ముద్ర పడకుండా ఆడాలని స్పష్టం చేశాడు. భారత జట్టులో శాశ్వత సభ్యుడిగా నిలదొక్కుకోవడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.


‘నా లక్ష్యం ఒక్కటే.. జట్టులో అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్లీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ‘కమ్‌బ్యాక్ బాయ్’ అని అనిపించుకోవడం నాకిష్టం లేదు. ప్రపంచ కప్ టోర్నీలకు ఎంపిక కాకపోవడం కాస్త బాధ కలిగించింది. కానీ క్రికెట్‌లో గెలుపోటములు సహజం. ఇది మాకు మానసికంగా బలంగా మారే అవకాశం ఇస్తుంది. నేను బౌలింగ్ విషయంలో చాలా క్లియర్‌గా ఉంటాను. 5-6 మీటర్ల మంచి లెంగ్త్‌లో బంతులు సంధిస్తే బ్యాటర్లకు ఆడటం కష్టమవుతుంది. అయితే ఆధునిక టీ20 క్రికెట్‌లో అన్ని విభాగాల్లో రాణించాల్సిన అవసరం ఉంది. అవకాశం వస్తే భవిష్యత్తులో టెస్టు క్రికెట్ ఆడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అని బిష్ణోయ్ వెల్లడించాడు.


ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన బిష్ణోయ్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కానీ అంతర్జాతీయ కెరీర్‌లో మాత్రం బిష్ణోయ్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. ఇప్పటివరకు 44 మ్యాచ్‌లలో 64 వికెట్లు తీశాడు. ఒక దశలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కూడా సాధించాడు. అయితే ఆసియా గేమ్స్, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో బిష్ణోయ్ ఎలా రాణించనున్నాడో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

గాయాల నెపంతో ఐపీఎల్‌ను మధ్యలో వీడేవారిని నిషేధించాలి: గావస్కర్

Updated Date - Jun 20 , 2026 | 08:46 PM