Share News

ఆఖరి వన్డే: అఫ్గాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:28 PM

చెపాక్ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఆఖరి వన్డే: అఫ్గాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
India vs Afghanistan

ఇంటర్నెట్ డెస్క్: చెపాక్ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(102) సెంచరీతో చెలరేగాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. క్రీజులో పాతుకుపోయి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. మరోవైపు భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో చెలరేగాడు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ మూడు సార్లు క్యాచ్ అందుకోవడం విశేషం.


అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(50) హాఫ్ సెంచరీ చేశాడు. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్‌ను.. హష్మతుల్లా, అజ్మతుల్లా ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇబ్రహీం జర్దాన్(11), మహ్మద్ నబీ(21) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబె తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!

ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

Updated Date - Jun 20 , 2026 | 05:30 PM