Share News

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్

ABN , Publish Date - Jun 20 , 2026 | 08:05 PM

చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్
India vs Afghanistan

ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనకు వచ్చిన అఫ్గానిస్థాన్ జట్టుకు షాక్ తగిలింది. తొలుత ఏకైక టెస్టులో ఓడిన అఫ్గాన్.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌లోనూ పరాభవం పాలైంది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అఫ్గాన్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని 28.4 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి భారత్ ఛేదించింది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్(110*) సెంచరీతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ(79) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్(20*) పరుగులు చేశాడు. ఆ ఒక్క వికెట్ అఫ్గాన్ బౌలర్ నబీ ఖాతాలో పడింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ జట్టు 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది(102) సెంచరీతో చెలరేగాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్(50) హాఫ్ సెంచరీ చేశాడు. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్ జట్టును.. వీరిద్దరూ గాడీలో పెట్టారు. ఐదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

గాయాల నెపంతో ఐపీఎల్‌ను మధ్యలో వీడేవారిని నిషేధించాలి: గావస్కర్

Updated Date - Jun 20 , 2026 | 08:06 PM