Share News

ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

ABN , Publish Date - Jun 20 , 2026 | 09:41 PM

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రెండు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు.

ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రెండు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ అర్ధశతకంతో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో గంగూలీ, ద్రవిడ్‌లను వెనక్కి నెట్టాడు. గంగూలీ 93 సార్లు 50కి పైగా పరుగులు చేయగా, ద్రవిడ్ 94 సార్లు చేశాడు. వీరిద్దరి వెనక్కి నెట్టిన రోహిత్.. 95 సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(145) అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ(131) రెండో స్థానంలో ఉన్నాడు.


అత్యధిక పరుగుల రికార్డు..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కూడా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన అతడు.. అఫ్గానిస్థాన్‌పై 79 పరుగుల ఇన్నింగ్స్‌తో తన మొత్తం పరుగులను 16,137కు చేర్చుకుని సెహ్వాగ్ రికార్డును కూడా దాటేశాడు. అంతేకాకుండా వన్డేల్లో ఇప్పటి వరకు 1100 ఫోర్లు బాది మరో రికార్డు నెలకొల్పాడు.


ఇవి కూడా చదవండి:

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్

Updated Date - Jun 20 , 2026 | 09:41 PM