ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:49 PM
భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో 790 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో 790 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ఇటీవల హర్మన్‌ప్రీత్ కౌర్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న స్మృతి.. బ్యాటింగ్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. మరో భారత బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ 652 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(782) రెండో స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఎలీస్ పెర్రీ తిరిగి టాప్-10లోకి ప్రవేశించింది. మరోవైపు వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానానికి పడిపోయింది.. ఆస్ట్రేలియా బౌలర్లు అన్నాబెల్ సదర్లాండ్, మేగన్ షట్ తమ స్థానాలను మెరుగుపరుచుకుని టాప్-5లోకి వచ్చారు.
టీ20ల్లోనూ అదుర్స్..
మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. టాప్-10లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. షఫాలీ వర్మ 759 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. స్మృతి మంధాన 754 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ 656 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్లు శ్రీ చరణి, దీప్తి శర్మ తమ తొలి రెండు స్థానాలను పదిలపరుచుకున్నారు. శ్రీ చరణి 817 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీప్తి శర్మ 754 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న ఏకైక భారత క్రికెటర్ దీప్తి శర్మ. ఆమె నాలుగో స్థానంలో కొనసాగుతోంది. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి