Share News

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2026 నుంచి పాకిస్థాన్ ఔట్..

ABN , Publish Date - Oct 09 , 2026 | 08:50 PM

భారత్ వేదికగా హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2026 ప్రారంభం కానుంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్, మొహాలీ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.

 ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2026  నుంచి పాకిస్థాన్ ఔట్..
Pakistan Hockey Team

స్పోర్ట్స్ డెస్క్: భారత్ వేదికగా హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2026 జరగనుంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్, మొహాలీ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను హాకీ ఇండియా రిలీజ్ చేసింది. మొత్తం ఆరు దేశాలు బరిలోకి దిగుతున్నాయి. భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదు. దాని స్థానంలో బంగ్లాదేశ్‌ ఆడుతోంది.


హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2026లో భారత్, బంగ్లాదేశ్‌, మలేసియా, జపాన్, కొరియా, చైనా పోటీ పడుతున్నాయి. భారత్‌లో మ్యాచ్‌లను ఆడేందుకు పాకిస్థాన్‌ హాకీ ఫెడరేషన్‌ (పీహెచ్‌ఎఫ్‌) నిరాకరించింది. ఈ టోర్నీని వేరే దేశానికి తరలించాలని.. లేదా తమ జట్టు ఆడే మ్యాచులను తటస్థ వేదికలపై నిర్వహించాలని పీహెచ్ఎప్ అధ్యక్షడు మోహిద్దీన్ అహ్మద్ డిమాండ్ చేశాడు. అయితే, అతడి విజ్ఞప్తిని ఆసియా హాకీ ఫెడరేషన్(ఏహెచ్ఎఫ్) తిరస్కరించింది. రిజ్వర్‌ జట్టుగా ఉన్న బంగ్లాదేశ్‌కు పాక్‌ స్థానంలో అవకాశం దక్కింది. దీంతో పాకిస్థాన్ పోయే.. బంగ్లా వచ్చే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


భారత్ మ్యాచుల షెడ్యూల్ ఇదే:

  • అక్టోబర్ 27న బంగ్లాదేశ్‌తో రాత్రి 7 గంటలకు

  • అక్టోబర్ 29న చైనాతో రాత్రి 7 గంటలకు

  • అక్టోబర్ 30న జపాన్‌తో రాత్రి 7 గంటలకు

  • నవంబర్ 1న మలేషియాతో రాత్రి 7 గంటలకు

  • నవంబర్ 2న కొరియాతో రాత్రి 7 గంటలకు


ఇవి కూడా చదవండి:

నా సలహా పాటించి ఉంటే ఐదు కప్పులు ఆర్సీబీవే: పార్థివ్

'హర్మన్‌ప్రీత్ దారి వేరు.. స్మృతి ప్రయాణం వేరు'.. మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!

Updated Date - Oct 09 , 2026 | 09:17 PM