నా సలహా పాటించి ఉంటే ఐదు కప్పులు ఆర్సీబీవే: పార్థివ్
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:48 PM
ఐపీఎల్‌లోని ప్రముఖ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. 18 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత గతేడాది తొలిసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత ఈ ఏడాది కూడా గెలిచి వరుసగా రెండో సారి విజేతగా నిలిచింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లోని ప్రముఖ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. 18 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత గతేడాది తొలిసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత ఈ ఏడాది కూడా గెలిచి వరుసగా రెండో సారి విజేతగా (RCB Won Titles) నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఆర్సీబీ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత రెండు సార్లు విజేతగా నిలిచిన ఆర్సీబీ తన సలహాలు పాటించి ఉంటే ఇప్పటికే ఐదు కప్పులను సొంతం చేసుకునేదని తెలిపాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్థివ్ 2014 వేలం సమయంలో ఏం జరిగిందో వెల్లడించాడు. 'జస్ప్రీత్ బుమ్రాను తీసుకొనే అవకాశం వద్దనుకొని ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. 2014 మెగా వేలంలో నన్ను (Parthiv Patel) తొలి రోజే భోజన విరామానికి ముందే జట్టులోకి తీసుకున్నారు. అప్పుడు మేనేజ్‌మెంట్ దృష్టికి ఓ విషయం తీసుకొచ్చా. బుమ్రాను ఉద్దేశించి... ఓ అద్భుతమైన ప్లేయర్ ఉన్నాడు. అతడిని తీసుకొనేందుకు చూడండి అని చెప్పా. అయితే, వారికి నేను ఇచ్చిన సలహా సరిగా అనిపించలేదేమో.. బుమ్రాలాంటి బౌలర్ ఏం చేస్తారు? అన్నట్లుగా వారి సమాధానం ఉంది' అని వెల్లడించాడు.
'బుమ్రా అంశాన్ని నేను ఓ బ్రాడ్‌కాస్ట్‌లో మాట్లాడా. ఆ తర్వాత ‘ఎక్స్’లోనూ స్పందించా. నేను అలా చేసి ఉండకూడదు. ఆ దశలో బుమ్రాను (Jasprit Bumrah) కొనుగోలు చేయడం సరైన నిర్ణయం అవుతుందని బెంగళూరు జట్టు యాజమాన్యం భావించలేదు. నా వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు కొందరు తమకు నచ్చిన విధంగా అపార్థాలను అంటగట్టారు’ అని పార్థివ్ తెలిపాడు. అలానే ఐపీఎల్ 2019 సీజన్ కంటే ముందు విరాట్ కోహ్లీ స్థానంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మేనేజ్‌మెంట్ తనను సంప్రదించిందని పార్థివ్ పటేల్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..
పదేళ్ల తర్వాత జట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!
బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు