అదంతా ఫేక్.. నేను ఏ మతాన్నీ కించపరచలేదు: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:29 PM
తన పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ మతాన్ని కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: తన పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ మతాన్ని కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశాడు. తనకు ఆపాదిస్తూ వస్తున్న వ్యాఖ్యలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేసే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని అభిమానులను కోరాడు. కేవలం వ్యూస్ కోసం కొందరు తన పేరును ఉపయోగించుకుంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మండిపడ్డాడు.
‘ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వ్యూస్ సంపాదించాలనే ఉద్దేశంతో నా పేరుతో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని, షేర్ చేయవద్దని అందరినీ కోరుతున్నా. ఏదైనా వార్త నేరుగా నా నుంచి రానప్పుడు దాన్ని నమ్మకండి. నా మతం విషయంలోనే కాదు.. ఏ మతం గురించి కూడా నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలను నమ్మే ముందు, ఇతరులకు పంపించే ముందు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని గట్టిగా కోరుతున్నా’ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
శాండ్ పేపర్ వివాదంపై లక్షలసార్లు సమాధానం చెప్పా: ప్యాట్ కమిన్స్
గంగూలీ బయోపిక్ ‘దాదా’ పోస్టర్‌పై విమర్శలు.. హీరో రియాక్షన్ ఇదే!