Share News

గంగూలీ బయోపిక్ ‘దాదా’ పోస్టర్‌పై విమర్శలు.. హీరో రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Oct 09 , 2026 | 10:27 AM

భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా’ చిత్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గంగూలీ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు స్పందించారు.

గంగూలీ బయోపిక్ ‘దాదా’ పోస్టర్‌పై విమర్శలు.. హీరో రియాక్షన్ ఇదే!
Rajkummar Rao

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరుకెక్కుతున్న ‘దాదా’ చిత్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. గంగూలీ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఏఐతో చేశారంటూ అభిమానులు, నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై గంగూలీ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు స్పందించారు. పోస్టర్‌పై వచ్చిన విమర్శలను చిత్ర బృందం స్వీకరించిందని, తమ తప్పును తెలుసుకుందని తెలిపారు.


‘ఆ పోస్టర్ తయారు చేసినవారు తమ తప్పు నుంచి పాఠం నేర్చుకున్నారు. ఏ పనైనా తొందరపడి చేయకూడది, సమయం తీసుకోవాలని తెలుసుకున్నారు. దాదాకు అభిమానుల్లో ఎలాంటి ఆదరణ ఉందో ఈ ఘటనతో వారికి స్పష్టమైంది’ అని రాజ్‌కుమార్ అన్నారు. గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌లో చిరస్మరణీయంగా నిలిచిన సందర్భాల్లో ఒకటైన లార్డ్స్ మైదానంలోని చొక్కా విప్పి గాల్లో తిప్పిన ఘట్టాన్ని ‘దాదా’ పోస్టర్‌లో రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టర్ విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు ఏఐతో రూపొందించారంటూ విమర్శలు చేశారు.


గంగూలీతో మంచి అనుబంధం..

సౌరభ్ గంగూలీతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని రాజ్‌కుమార్ రావు వెల్లడించారు. ‘నేను గంగూలీని చాలాసార్లు కలిశాను. ఆయన ఇంట్లో, ఈడెన్ గార్డెన్స్‌లో కూడా షూటింగ్ చేశాం. కోల్‌కతాలో కొంతకాలం ఉన్నాం. దాదాతో చాలా సమయం గడిపాను. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు వెల్లడించలేను. ఆయన కూడా చాలా విషయాలను బహిరంగంగా పంచుకున్నారు. మేమంతా ఆయనను ప్రేమిస్తాం. ఆయన ఓ దిగ్గజం. నేటి భారత క్రికెట్ జట్టు ఈ స్థాయికి చేరుకోవడానికి పునాది వేసిన వారిలో గంగూలీ ఒకరు’ అని రాజ్‌కుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ కెప్టెన్సీకే ఎసరు పెట్టారా? ఆర్సీబీ మాజీ స్టార్ సంచలన వ్యాఖ్యలు

నెట్స్‌లో వైభవ్ వీర విధ్వంసం.. రెండో టీ20లో చోటు దక్కుతుందా?

Updated Date - Oct 09 , 2026 | 10:27 AM