Share News

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో కీలక పోరు.. టాస్ నెగ్గిన సీఎస్కే

ABN , Publish Date - May 18 , 2026 | 07:15 PM

ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో కీలక పోరు.. టాస్ నెగ్గిన సీఎస్కే
CSK vs SRH

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ధోని ఆడనున్నాడా? లేదా? అనే వార్తలకు టాస్ సమయంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెక్ పెట్టాడు. ‘ధోని జట్టుతో పాటే ఉన్నాడు. కానీ గేమ్ ఆడేంత ఫిట్‌నెస్ లేదు’ అని తెలిపాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ సీఎస్కేకు అత్యంత కీలకం. ఇందులో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇప్పటికే 12 మ్యాచుల్లో ఆరు విజయాలతో సీఎస్కే ఐదో స్థానంలో ఉంది. మరోవైపు 12 మ్యాచుల్లో 7 విజయాలతో ఎస్ఆర్‌హెచ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.


సీఎస్కే తుది జట్టు

రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, ప్రశాంత్ వీర్, అకీల్ హుస్సేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, జాన్సన్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ముకేశ్ చౌదరి, మ్యాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, గుర్జాప్‌నీత్ సింగ్


ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు

ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, నితీశ్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, లివింగ్‌స్టోన్, హర్ష్ దూబె, హర్షల్ పటేల్


ఇవి కూడా చదవండి:

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

Updated Date - May 18 , 2026 | 07:15 PM