రిటైర్‌మెంట్ వార్తల వేళ.. చెన్నైలో ఎన్ఎస్‌జీ కమాండోలతో ధోని
ABN , Publish Date - May 18 , 2026 | 06:57 PM
మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అభిమానులను అలరించే తలా.. విభిన్న రూపంలో కనిపించాడు. క్రికెట్ కిట్‌ను పక్కన పెట్టి చెన్నైలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్‌జీ) ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడ కమాండోలతో కలిసి షూటింగ్ డ్రిల్స్‌లో పాల్గొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో చెన్నై హోం గ్రౌండ్ చెపాక్‌లో ఇదే సీఎస్కే ఆఖరి మ్యాచ్. ఈ సీజన్‌లో గాయం కారణంగా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని.. నేడు బరిలోకి దిగనున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్‌పై ఆడి రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. ధోనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అభిమానులను అలరించే తలా.. విభిన్న రూపంలో కనిపించాడు. క్రికెట్ కిట్‌ను పక్కన పెట్టి చెన్నైలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్‌జీ) ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడ కమాండోలతో కలిసి షూటింగ్ డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్‌లో తలా పునరాగమనం చేస్తే చూడాలని అభిమానులు నిరీక్షిస్తోన్న సమయంలో.. ఎన్ఎస్‌జీ హబ్‌ను ధోని సందర్శించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అక్కడ కమాండోలతో సరదాగా ముచ్చటించాడు. వారి ఫిట్‌నెస్, శిక్షణ విధానాల గురించి ఆరా తీశాడు. తన సరదా వ్యాఖ్యలతో అక్కడి సిబ్బందిని నవ్వుల్లో ముంచెత్తాడు. తనను చూపిస్తూ.. ‘నేను ఫిట్‌గా కనిపిస్తున్నానా?’ అని ప్రశ్నించడంతో అక్కడున్న కమాండోలు చిరునవ్వులు చిందించారు. కాగా 2011 వన్డే ప్రపంచ కప్ విజయం తర్వాత ధోనికి భారత టెర్రిటోరియల్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జమ్ము కశ్మీర్‌లో పలు శిక్షణ కార్యక్రమాల్లో కూడా ధోని పాల్గొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్
బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు