Share News

ఐపీఎల్: రిటైర్‌మెంట్‌పై ఐదేళ్ల క్రితమే ధోని హింట్!

ABN , Publish Date - May 18 , 2026 | 04:57 PM

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలకనున్నాడా? ఈ ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ధోని రిటైర్‌మెంట్‌పై ప్రచారం ఊపకుందున్న నేపథ్యంలో.. ఐదేళ్ల క్రితం తన రిటైర్‌మెంట్ గురించి తలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చర్చనీయాంశం అయింది.

ఐపీఎల్: రిటైర్‌మెంట్‌పై ఐదేళ్ల క్రితమే ధోని హింట్!
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలకనున్నాడా? ఈ ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగి.. రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ధోని రిటైర్‌మెంట్‌పై ప్రచారం ఊపకుందున్న నేపథ్యంలో.. ఐదేళ్ల క్రితం తన రిటైర్‌మెంట్ గురించి తలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చర్చనీయాంశం అయింది.


2021 ఐపీఎల్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు టైటిల్ వేడుకల సందర్భంగా ధోని తన రిటైర్‌మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా క్రికెట్ ప్రయాణాన్ని ఎప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకుంటాను. నా చివరి వన్డే మ్యాచ్ నా స్వస్థలం రాంచీలో ఆడాను. అలాగే నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలోనే ఆడాలని కోరుకుంటున్నాను. అది వచ్చే ఏడాదా..? లేక ఐదేళ్ల తర్వాతా..? అనేది తెలియదు’ అని ధోని వెల్లడించాడు. అయితే ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఈ సీజన్‌తో సరిగ్గా ఐదేళ్లు అవ్వడం.. ఈ సమయంలోనే ధోని వీడ్కోలు పలుకుతాడనే వార్తలు రావడంతో అభిమానుల్లో ఈ చర్చ మరింత వేడెక్కింది.


ఇదిలా ఉంటే, ధోని అందుబాటులో ఉన్నాడా? సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా? అనే విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ధోని ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకోనున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే సీఎస్కేకు ఈ మ్యాచ్ కీలకం.


ఇవి కూడా చదవండి:

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

Updated Date - May 18 , 2026 | 06:20 PM