Share News

వైభవ్ సూర్యవంశీ నా కంటే గొప్ప ప్లేయర్: ఆర్ఆర్ కోచ్ సంగక్కర

ABN , Publish Date - May 18 , 2026 | 04:25 PM

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర.. వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యవంశీ తన కంటే మెరుగైన బ్యాటర్ అని పేర్కొన్నాడు.

వైభవ్ సూర్యవంశీ నా కంటే గొప్ప ప్లేయర్: ఆర్ఆర్ కోచ్ సంగక్కర
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు చవి చూస్తున్నా.. వైభవ్ మాత్రం బ్యాటింగ్‌లో ఔరా అనిపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర.. వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యవంశీ తన కంటే మెరుగైన బ్యాటర్ అని పేర్కొన్నాడు.


‘వైభవ్‌కు క్రికెట్ అంటే చాలా ఆసక్తి. ప్రాక్టీస్ సమయంలో అతడితో నేను ఎక్కువగా మాట్లాడను. రిలాక్స్‌గా ఉండి బ్యాటింగ్ చేయడమే అతడికి అవసరం. నేను మాట్లాడాల్సి వస్తే క్రికెట్ గురించే ఎక్కువ చర్చలు ఉంటాయి. వైభవ్‌కు పక్కనే ఉండి తండ్రిలా మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. ఆటలో కొన్ని మెలుకువలు చెప్తే సరిపోతుంది. బౌలర్లు ఎలా బంతులు వేయొచ్చు? షార్ట్ బాల్స్, స్వింగ్ యార్కర్లను ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి వాటి గురించి వైభవ్‌తో మ్యాచ్‌కు ముందే చర్చిస్తాం. అయితే ఎలా బ్యాటింగ్ చేయాలనుకున్నా.. తన మీద తాను పూర్తి నమ్మకంగా ఉండాలని చెప్తాం. గంటల తరబడి బ్యాటింగ్ చేయడానికి వైభవ్ ఇష్టపడతాడు. అతడు కేవలం బంతి వస్తే బలంగా కొట్టే ప్లేయర్ కాదు. పిచ్ పరిస్థితులను కూడా అర్థం చేసుకుని ఆడే ఆటగాడు’ అని సంగక్కర తెలిపాడు.


ఆ విషయంలో వైభవ్ మెరుగుపడాలి..

‘వైభవ్‌ పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతాడు. చాలా త్వరగా 30ల్లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరుతున్నాడు. ఇదేమీ నన్ను కలవరానికి గురి చేయడం లేదు. తప్పకుండా ఈ విషయంలో అతడు ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతడు వేగంగా చేసే 30-40 పరుగులు కూడా జట్టుకు చాలా ఉపయోగపడతాయి. మా జట్టులో మరో ఆరుగురు దూకుడుగా ఆడే బ్యాటర్లు ఉన్నారు. ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించేందుకు ఈ స్టార్ట్ సరిపోతుంది’ అని సంగక్కర విశ్లేషించాడు.


ఇవి కూడా చదవండి:

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

Updated Date - May 18 , 2026 | 04:26 PM