Share News

ఎస్ఆర్‌హెచ్-సీఎస్కే: కీలక పోరుకు వర్షం ముప్పు!

ABN , Publish Date - May 18 , 2026 | 05:41 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎస్ఆర్‌హెచ్-సీఎస్కే: కీలక పోరుకు వర్షం ముప్పు!
CSK vs SRH

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం సీఎస్కే ఆడిన 12 మ్యాచుల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ పోరులో నెగ్గి టాప్ 4కి చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ జట్టు 14 పాయింట్లతో మూడో స్థానంలోనే ఉండగా.. తన స్థానాన్ని మరింత బలపర్చుకుని ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలనే కసితో ఉంది. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


చెన్నైలో మ్యాచ్ ప్రారంభ సమయానికి వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రారంభ సమయంలో వర్షం పడే అవకాశం సుమారు 34 శాతం ఉండగా, రాత్రి సమయానికి 47 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో మేఘావృత వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే మ్యాచ్ రద్దయ్యేంత పరిస్థితి లేదని.. పరిమితంగానే వర్ష ప్రభావం ఉండొచ్చని సమాచారం. ఆటకు వర్షం అంతరాయం కలిగి మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అదే జరిగే సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలపై ప్రభావం పడుతుంది. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సన్‌రైజర్స్‌పైనే కాకుండా వరుణుడిపైన కూడా పైచేయి సాధించాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

Updated Date - May 18 , 2026 | 05:45 PM