ఐపీఎల్ 2026: సీఎస్కేతో పోరు.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - May 18 , 2026 | 09:37 PM
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సీఎస్కే బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్(44; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. కార్తిక్ శర్మ(32; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
వారిద్దరూ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సంజు శాంసన్(27), రుతురాజ్ గైక్వాడ్(15), ఉర్విల్ పటేల్(13), శివమ్ దూబె(26), ప్రశాంత్ వీర్(11) విఫలమయ్యారు. అకీల్ హుస్సేన్(3*) నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 3, సాకిబ్ హుస్సేన్ 2, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్
బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు