Share News

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:33 PM

మహిళల ఐపీఎల్‌ 2027 ఎడిషన్‌ షెడ్యూల్‌ ఇవాళ విడుదలైంది. ఈ ఎడిషన్‌ మ్యాచ్‌లు జనవరి 14-ఫిబ్రవరి 7 మధ్యలో జరుగనున్నాయి.

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ
WPL 2027 Schedule

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ అభిమానుల కోసం ఓ క్రేజ్ న్యూస్ వచ్చింది. పురుషుల ఐపీఎల్ తరహాలో మహిళల కోసం నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ 2027 ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ(బుధవారం) రిలీజ్ అయింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ జనవరి 14 జరగనుంది. ఫిబ్రవరి 7న ఈ లీగ్ ముగియనుంది. ఈ సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్నీ కూడా ముంబై, వడోదర వేదికలుగా జరగనున్నాయి. ఈ రెండు వేదికలు చెరో 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.


డబ్ల్యూపీఎల్ 2027 సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌ వడోదర వేదికగా జరుగనుంది. రెండో మ్యాచ్ జనవరి 15న యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఫిబ్రవరి 5, 7 తేదీల్లో జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ పోరుకు‌ ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఎడిషన్‌ మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. డబ్ల్యూపీఎల్‌లో మొత్తం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి.


కాగా, డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్‌ ఫైనల్లో ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఆ తుదిపోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన ఆర్సీబీ.. రెండో సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన 41 బంతుల్లో చేసిన 87 పరుగులు చేసి.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.


మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ను విచిత్రమైన శాపం వెంటాడుతోంది. వరుసగా నాలుగో ఎడిషన్‌ ఫైనల్లోనూ ఓడిన ఢిల్లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2026లో జెమీమా రోడ్రిగ్స్ ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి తమ జట్టును ఫైనల్స్‌కు చేర్చింది. కానీ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది.


ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

ఇది నిరసనల జమానా: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సరదా వ్యాఖ్య

Updated Date - Nov 04 , 2026 | 07:41 PM