Share News

ముస్తాక్‌ అలీ ట్రోఫీకి బిహార్‌ సారథిగా వైభవ్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:41 AM

చిరుప్రాయంలోనే రికార్డులు కొల్లగొడుతున్న టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి జట్టును నడిపించే బాధ్యతలు అప్పగించారు.

ముస్తాక్‌ అలీ ట్రోఫీకి  బిహార్‌ సారథిగా వైభవ్‌
Vaibhav Suryavanshi

పట్నా: చిరుప్రాయంలోనే రికార్డులు కొల్లగొడుతున్న టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి జట్టును నడిపించే బాధ్యతలు అప్పగించారు. ఈనెల 14న మొదలయ్యే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో బిహార్‌ సీనియర్‌ జట్టుకు కెప్టెన్‌గా వైభవ్‌ను నియమించారు. ఈ మేరకు వైభవ్‌ సారథ్యంలోని 17 మందితో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించారు. సూరజ్‌ కశ్యప్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గ్రూప్‌-బిలో భాగంగా వైభవ్‌ బృందం తమ తొలి పోరును 14న సౌరాష్ట్ర జట్టుతో ఆడనుంది.


ఈ వార్తలనూ చదవండి:

జోరు సాగనీ..

టెస్టులకు షమి వీడ్కోలు

ప్రత్యేక ప్రదర్శనకు దాదా ‘లార్డ్స్‌’ జెర్సీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:41 AM