Share News

టెస్టులకు షమి వీడ్కోలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:08 AM

భారత వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమి టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. శుక్రవారం సోషల్‌ మీడియాలో తను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

టెస్టులకు షమి వీడ్కోలు
Mohammad Shami

న్యూఢిల్లీ: భారత వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమి టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. శుక్రవారం సోషల్‌ మీడియాలో తను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 2013లో అరంగేట్రం చేసిన షమి మూడేళ్ల క్రితం చివరి టెస్టు ఆడాడు. అలాగే 2025 చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత అతడిని భారత సెలెక్టర్లు ఏ ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేయడం లేదు. మరోవైపు దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్నప్పటికీ టెస్టుల్లో అవకాశం దక్కకపోవడంతో ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడమే మేలని భావించినట్టుంది. అయుతే పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగుతానని 36 ఏళ్ల షమి పేర్కొన్నాడు.


‘నేను తెలుపు జెర్సీని వదిలేస్తున్నాను. కానీ దానితో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటాయి. తొలిసారి టెస్టు జెర్సీని ధరించినప్పుడు దేశానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలనే కల కన్నాను. టెస్టు క్రికెట్‌ అనేది నా జీవితంలో అత్యంత ముఖ్యభాగం. అందుకే బరువెక్కిన హృదయంతోనే ఈ ఫార్మాట్‌కు ముగింపు పలుకుతున్నాను’ అని షమి తెలిపాడు. అలాగే ఈ సందర్భంగా బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌), సహచర క్రికెటర్లు, కోచ్‌లు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. 2023లో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో షమి చివరిసారి పాల్గొన్నాడు. తన కెరీర్‌లో షమి 64 టెస్టుల్లో 229 వికెట్లు తీశాడు.


ఈ వార్తలనూ చదవండి:

జోరు సాగనీ..

ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:08 AM