ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..
ABN , Publish Date - Nov 06 , 2026 | 03:26 PM
భారత క్రికెట్ జట్టు మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాడు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సూర్యకుమార్ కుటుంబంతో ప్రధాని మోదీ ఆప్యాయంగా మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాడు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సూర్యకుమార్ కుటుంబంతో ప్రధాని మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ముఖ్యంగా సూర్యకుమార్ పిల్లలతో మోదీ సరదాగా గడపడం ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం సందర్భంగా అందుకున్న బంగారు పతకాన్ని ధరించి ఈ సమావేశంలో కనిపించాడు (PM Modi Meets Suryakumar Yadav).
సూర్యకుమార్ యాదవ్ మెడల్‌ను ప్రధాని మోదీ చేతిలోకి తీసుకుని పరిశీలించారు. ప్రపంచకప్ విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఇద్దరూ ప్రత్యేక క్షణాలను పంచుకున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో సూర్యకుమార్ కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి మరోసారి ప్రపంచ విజేతగా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ సమావేశంలో సూర్యకుమార్ కుమార్తె రిద్దిమా ప్రధాని మోదీ ముందు భక్తి గీతం ఆలపించింది. చిన్నారి పాటను మోదీ ఆసక్తిగా విన్నారు (PM Modi Diwali Meeting).
సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో గడిపిన క్షణాలను ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. దీపావళి పండుగ వాతావరణంలో అయోధ్యలో రాముడి రాక, సరయూ నది ప్రాధాన్యం ఈ ఏడాది వేడుకలకు మరింత పవిత్రతను తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
కొనసాగుతున్న లాభాలు.. 1,200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
ఎస్‌ఈటీఎల్ లాభంలో 38 శాతం వృద్ధి