ఎస్‌ఈటీఎల్ లాభంలో 38 శాతం వృద్ధి
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:32 AM
స్టాండర్డ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్‌ఈటీఎల్).. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్టాండర్డ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్‌ఈటీఎల్).. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.296.60 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.28.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం రూ.62.3 శాతం పెరగగా లాభం 37.9 శాతం వృద్ధి చెందింది. కీలక వ్యాపారంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ బలమైన వృద్ధి చేయటం కలిసి వచ్చిందని ఎస్‌ఈటీఎల్ పేర్కొంది. ఫార్మా, కెమికల్, బయోటెక్నాలజీ, బెవరేజెస్ సహా ఏఐ డేటా సెంటర్ పరిశ్రమకు అవసరమైన ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందిస్తోంది. కాగా సెప్టెంబరుతో ముగిసిన ప్రధమార్థంలో కంపెనీ రూ.544.30 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.54.9 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
ఈ వార్తలూ చదవండి
ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..
ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం