ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..
ABN , Publish Date - Nov 05 , 2026 | 07:12 PM
ఆర్నబ్, మురసు తుఫాన్‌ల బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం విట్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ జి. విశ్వనాథన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళంగా అందించారు.
అమరావతి, నవంబర్ 5: ఆర్నబ్, మురసు తుఫాన్‌ల బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం విట్ యూనివర్సిటీ(Vellore Institute of Technology) ఛాన్సలర్ డాక్టర్ జి. విశ్వనాథన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళంగా అందించారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.కోటి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ విశ్వనాథన్.. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలవడం తమ నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు, విపత్తు సహాయం, సమాజ అభివృద్ధి కోసం విట్ సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో విట్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ శంకర్ విశ్వనాథన్, డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, విట్-ఏపీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి పాల్గొన్నారు.