ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?
ABN , Publish Date - Nov 05 , 2026 | 03:48 PM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న ఉద్రిక్తతలు మినహా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న ఉద్రిక్తతలు మినహా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
క్రమ సంఖ్య | జిల్లా | పోలింగ్ శాతం |
1 | శ్రీకాకుళం | 28.40% |
2 | పార్వతీపురం మన్యం | 28.76% |
3 | విజయనగరం | 31.23% |
4 | విశాఖపట్నం | 35.11% |
5 | అనకాపల్లి | 31.37% |
6 | అల్లూరి సీతారామరాజు | 29.49% |
7 | పోలవరం | 30.74% |
8 | కాకినాడ | 28.92% |
9 | కోనసీమ | 27.60% |
10 | తూర్పుగోదావరి | 30.18% |
11 | పశ్చిమగోదావరి | 30.86% |
12 | ఏలూరు | 26.36% |
13 | కృష్ణా | 34.85% |
14 | ఎన్టీఆర్ | 33.32% |
15 | గుంటూరు | 33.78% |
16 | పల్నాడు | 32.58% |
17 | బాపట్ల | 23.89% |
18 | ప్రకాశం | 30.39% |
19 | మార్కాపురం | 32.01% |
20 | ఎస్పీఎస్ఆర్ నెల్లూరు | 29.61% |
21 | తిరుపతి | 31.50% |
22 | చిత్తూరు | 34.26% |
23 | అన్నమయ్య | 34.20% |
24 | వైఎస్ఆర్ కడప | 36.35% |
25 | అనంతపురం | 33.98% |
26 | శ్రీ సత్యసాయి | 33.63% |
27 | కర్నూలు | 32.69% |
28 | నంద్యాల | 33.42% |
మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన సగటు పోలింగ్ శాతం - 30.50%
అత్యధిక పోలింగ్: వైఎస్ఆర్ కడప – 36.35%
రెండో స్థానం: విశాఖపట్నం – 35.11%
అత్యల్ప పోలింగ్: బాపట్ల – 23.89%
ఈ వార్తలూ చదవండి
వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
అనంతపురం పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు.. ఇద్దరిపై దాడి