Share News

వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:47 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ ఫిర్యాదు చేశారు.

వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
TDP Complaint

అమరావతి, నవంబర్ 5: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. పులివెందులలో పెట్రోల్ బాంబులతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన వైసీపీ శ్రేణుల అరాచకాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సంతనూతలపాడు, సత్తెనపల్లి, చీరాల, చంద్రగిరి, పులివెందుల నియోజకవర్గాల్లో వైసీపీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలు, ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు.


11 గంటలకు సగటున 21.12 శాతం పోలింగ్

ఇక ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి సగటున 21.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మార్కాపురం జిల్లాలో 34.66 శాతం మేర పోలింగ్ నమోదైంది. అలాగే అత్యల్పంగా ASR జిల్లాలో 11.81 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయ్యింది. చిత్తూరులో 29.87 శాతం, అనంతపురంలో 28.88 శాతం, గుంటూరులో 28.69శాతంగా పోలింగ్ నమోదు అయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 27.45 శాతం, వైఎస్ఆర్ కడపలో 26.85 శాతం, విశాఖపట్నంలో 26.77 శాతంగా పోలింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో 25.81 శాతం, విజయనగరంలో 25.25 శాతం, నంద్యాలలో 25.41శాతం పోలింగ్ నమోదైంది. అటు తూర్పుగోదావరి జిల్లాలో 13.75 శాతం, పల్నాడులో 14.02 శాతం, ప్రకాశంలో 15.76 శాతంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.


ఇవి కూడా చదవండి...

పెనగలూరులో పెట్రోల్ బాంబుల దాడి ప్రచారం అవాస్తవం: తిరుపతి ఎస్పీ

తిరుపతి లడ్డూ కేసు.. ఇతర రాష్ట్రాలకు విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 12:47 PM