Share News

ప్రత్యేక ప్రదర్శనకు దాదా ‘లార్డ్స్‌’ జెర్సీ

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:19 AM

ఇరవై నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో టీమిండియా గెలిచిన తర్వాత బాల్కనీలో కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తన చొక్కా విప్పేసి గాల్లోకి ఎగరేసిన సందర్భం గుర్తుందిగా!

ప్రత్యేక ప్రదర్శనకు దాదా ‘లార్డ్స్‌’ జెర్సీ
Sourav Ganguly

ముంబై: ఇరవై నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో టీమిండియా గెలిచిన తర్వాత బాల్కనీలో కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తన చొక్కా విప్పేసి గాల్లోకి ఎగరేసిన సందర్భం గుర్తుందిగా! ఆనాడు దాదా గాల్లోకి తన జెర్సీని విసిరేసి సంబరాలు చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది.


ఇప్పుడా జెర్సీ ముంబైలోని వాంఖడే స్టేడియంలోని శరద్‌పవార్‌ క్రికెట్‌ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమైంది. గంగూలీ జెర్సీతో పాటు మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ధరించిన వన్డే క్యాప్‌, 1982 నాటి భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు జట్ల మధ్య మెడల్‌, సచిన్‌ టెండూల్కర్‌ వన్డే జంపర్‌, ధోనీ వన్డే జెర్సీ, రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు జెర్సీలను ఈనెల 14, 15, 17వ తేదీల్లో క్రికెట్‌ మ్యూజియంలో ప్రజల సందర్శనార్ధం ప్రత్యేక ప్రదర్శనకు ఉంచనున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

జోరు సాగనీ..

టెస్టులకు షమి వీడ్కోలు

చైనాలో రాకెట్‌ పట్టి..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:19 AM