చైనాలో రాకెట్ పట్టి..
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:13 AM
తన్వి పత్రి.. యూత్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి చరిత్ర సృష్టించిన ఈ 15 ఏళ్ల టీనేజర్ ఇప్పుడు భారత బ్యాడ్మింటన్‌లో నయా సంచలనం.
తన్వి పత్రి.. యూత్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి చరిత్ర సృష్టించిన ఈ 15 ఏళ్ల టీనేజర్ ఇప్పుడు భారత బ్యాడ్మింటన్‌లో నయా సంచలనం. గతంలో భారత్ నుంచి హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ మాత్రమే యూత్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గగా.. మహిళల్లో పతకం రావడం మాత్రం ఇదే తొలిసారి. ఇలా.. అత్యద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న తన్వి సొంత రాష్ట్రం ఒడిశా. తన్వి తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. తన్వికి ఆరేళ్లప్పుడు ఉద్యోగరీత్యా ఆమె అమ్మానాన్న చైనాలోని షాంఘైకి వెళ్లారు.
ఆ సమయంలో చైనాలోనే బ్యాడ్మింటన్‌లో ఓనమాలు దిద్దిన తన్వి.. అనంతరం తనకు తొమ్మిదేళ్లప్పుడు తల్లిదండ్రులతో కలిసి భారత్ చేరుకుంది. స్వదేశంలో మెరుగైన శిక్షణ కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్స్‌లెన్స్‌లో చేరిన ఆమె.. రెండేళ్ల క్రితం ఆసియా అండర్-15 టైటిల్ నెగ్గింది. ఆసియా అండర్-17 చాంపియన్‌గానూ నిలిచిన తన్వి.. గతనెల ఆరంభంలో ఈజిప్టు వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో తీవ్ర నిరాశకు లోనైంది. ఆ ఓటమితో మరింత కసితో రగలిపోయిన తన్వి.. యూత్ ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించింది. పతకంతో రికార్డు సృష్టించి భవిష్యత్ సింధుగా నీరాజనాలు అందుకుంటోంది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఈ వార్తలనూ చదవండి:
బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!
Read Latest AP News And Telangana News And National News
And Telugu News