Share News

తిలక్ వర్మపై రోహిత్ ప్రభావం.. ‘డగౌట్‌లో కూర్చొని ఆయనను గమనించేవాడిని’

ABN , Publish Date - Oct 07 , 2026 | 07:22 PM

టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ఉన్న సంగతి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే జాతీయ జట్టుకు డిప్యూటీ కెప్టెన్‌గా ఉండటంపై సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

తిలక్ వర్మపై రోహిత్ ప్రభావం.. ‘డగౌట్‌లో కూర్చొని ఆయనను గమనించేవాడిని’
Tilak Varma

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ఉన్న సంగతి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే జాతీయ జట్టుకు డిప్యూటీ కెప్టెన్ గా ఉండటంపై సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పలు సందర్భాల్లో కెప్టెన్ గా తనదైన నిర్ణయాలు తీసుకుని క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తాను వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించడంపై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాయకత్వ లక్షణాలను అందుకోవడంలో రోహిత్, విరాట్ కోహ్లీ పరోక్షంగా సాయపడ్డారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వీరిద్దరి కెప్టెన్సీని దగ్గర్నుంచి చూసి గమనించినట్లు తెలిపాడు.


విరాట్‌తో పోలిస్తే రోహిత్ శర్మ నాయకత్వ ప్రభావం తనపై ఎక్కువగా ఉంటుందని తిలక్ వర్మ వెల్లడించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మంచి వ్యూహాలను అమలు చేయడంలో శర్మ ప్రత్యేకమని పేర్కొన్నాడు. తాను విరాట్ కోహ్లీ (Virat Kohli) సారథ్యంలో ఆడలేదని, రోహిత్ నాయకత్వంలోనే ఆడాననని తెలిపాడు. భారత్‌ జట్టుతోపాటు ముంబై ఇండియన్స్‌ తరఫున తామిద్దరం కలిసి ఆడామని వర్మ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానని, మైదానంలో ఉంటే అతడి నిబద్ధత అద్భుతమని ప్రశంసించాడు. మైదానంలో తాను ఎక్కువగా రోహిత్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించనని, మైదానం బయటకు వచ్చాక చాలా విషయాలపై చర్చిస్తామని తిలక్ వర్మ పేర్కొన్నాడు.


విరాట్, రోహిత్ (Rohit Sharma) తుది జట్టులో ఉన్నప్పుడు తాను ఎక్కువగా డగౌట్‌కే పరిమితైన రోజులు ఉన్నాయని, బెంచ్‌పై కూర్చొని వారిద్దరిని గమనిస్తూ ఉంటాని తిలక్ వర్మ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. సారథిగా రోహిత్ భాయ్.. బౌలర్లను ఎలా సమయం బట్టి వినియోగిస్తాడో చూస్తుంటానని, వీటన్నింటిని నేర్చుకుని తాను స్వతహాగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తానని తిలక్ పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్సీ అంటే తన దృష్టిలో పెద్ద బాధ్యతేనని, జట్టు వ్యూహాలు, నిర్ణయాలు తీసుకోవడంలో తాను సాయం చేస్తానని తెలిపాడు. ఇంతకుముందు కంటే ఇప్పుడు అభిమానులు తనను చూసే ధోరణి కూడా మారిందని, కాస్త సీనియర్‌ ప్లేయర్‌గా పరిగణిస్తారని సంతోషం వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో తొలిసారి టాప్-10.. టీ20 ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు జంప్

తన్మయ్ బలోడా ప్రపంచ రికార్డు.. యూత్ టెస్టులో 14 వికెట్లతో సౌథీ రికార్డు బద్దలు

అనుష్క మైదానంలో ఉంటే కోహ్లీ సెంచరీ ఖాయం: రవిశాస్త్రి

Updated Date - Oct 07 , 2026 | 07:35 PM