Share News

అనుష్క మైదానంలో ఉంటే కోహ్లీ సెంచరీ ఖాయం: రవిశాస్త్రి

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:33 PM

ప్రముఖ కామెడీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్-5 రాబోయే ఎపిసోడ్‌కు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు. ఈ షోలో విరాట్-అనుష్కపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అనుష్క మైదానంలో ఉంటే కోహ్లీ సెంచరీ ఖాయం: రవిశాస్త్రి
Virat Kohli

స్పోర్ట్స్ డెస్క్: ప్రముఖ కామెడీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్-5 రాబోయే ఎపిసోడ్‌కు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో క్రికెట్‌కు సంబంధించి రవిశాస్త్రి చెప్పిన పలు విషయాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమలో ఉన్న.. నాటి జ్ఞాపకాలను ఈ షోలో ఆయన గుర్తుచేశారు.


విదేశీ పర్యటనల్లో ఆటగాళ్లతో పాటు వారి భాగస్వాములను లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ను అనుమతించడంపై గతంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత, మద్దతు ఎంతో అవసరమని, అందుకే వారి భాగస్వాములు వెంట ఉండటం మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపిస్తూ కొన్ని విషయాలను గుర్తు చేశారు. అనుష్క శర్మ స్టాండ్స్‌లో ఉండి మ్యాచ్ చూస్తున్న సమయంలో కోహ్లీ ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండేదని చెప్పారు. అంతేకాక ఆమె మైదానంలో ఉంటే కోహ్లీ సెంచరీ చేయడం ఖాయమని గుర్తు చేశారు.


'ఒక మ్యాచ్ డిసెంబరు 26న జరిగింది. విరాట్ మైదానంలోకి ఒక యోధుడిలా పోరాడుతూ.. ఏకంగా 160 పరుగులు సాధించాడు. ఆ సమయంలో సెంచరీ పూర్తి కాగానే బ్యాట్‌ను ముద్దుపెట్టుకుని, స్టాండ్స్‌లో ఉన్న అనుష్కకు ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు' అని రవిశాస్త్రి నవ్వుతూ ఆ సంఘటనను రీ క్రియేట్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో గవాస్కర్, రవిశాస్త్రి కలిసి డ్రెస్సింగ్ రూమ్ రహాస్యాలను, పాతతరం క్రికెట్ జ్ఞాపకాలను పంచుకున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

నేటి నుంచే ‘కపిల్ దేవ్ ఇన్విటేషనల్ టూర్ ఛాంపియన్‌షిప్’.. రూ.2 కోట్ల ప్రైజ్ మనీ..

హర్మన్-స్మృతి మధ్య విభేదాలు? కారణం అదేనా..

అజిత్ అగార్కర్‌కు గంభీర్ భావోద్వేగ వీడ్కోలు.. ‘చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు’

Updated Date - Oct 07 , 2026 | 04:37 PM