Share News

అజిత్ అగార్కర్‌కు గంభీర్ భావోద్వేగ వీడ్కోలు.. ‘చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు’

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:31 PM

టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగిసింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా వేదికగా.. అగార్కర్ సేవలను ప్రశంసిస్తూ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు.

అజిత్ అగార్కర్‌కు గంభీర్ భావోద్వేగ వీడ్కోలు.. ‘చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు’
Ajit Agarkar

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగిసింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Head Coach) సోషల్ మీడియా వేదికగా.. అగార్కర్ సేవలను ప్రశంసిస్తూ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా ప్రజ్ఞా ఓజా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే బీసీసీఐ కొత్త సెలక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.


‘ప్రియమైన.. అజిత్ (Ajit Agarkar) భాయ్.. మీతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం భావిస్తున్నాను. ఈ ఆధ్వర్యంలో టీమిండియా ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. ఇదే మీ దృఢమైన విశ్వాసానికి నిదర్శనం. మీరు ఎప్పుడూ జట్టుకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. అలానే ఎప్పటికీ గుర్తుపెట్టుకొని గౌరవిస్తుంది. జట్టు ఎంపిక సమయంలో మీపై వచ్చిన విమర్శలకూ భయపడలేదు. మీ భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని గంభీర్‌ (Gautam Gambhir) పేర్కొన్నాడు.


2023 జూలైలో బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ పర్యవేక్షణలో భారత్ ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ఆ సమయంలో భారత్ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడమే కాకుండా, 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచ కప్‌లను కూడా కైవసం చేసుకుంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వైట్-బాల్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయడం అగార్కర్ చివరి బాధ్యత కావడం విశేషం.


ఇవి కూడా చదవండి:

ప్రేమానంద్ ఆశ్రమానికి వెళ్లేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు.. క్లారిటీ

హర్మన్-స్మృతి మధ్య విభేదాలు? కారణం అదేనా..

మనం గెలవడం కొందరికి ఇష్టం లేదు.. అర్జెంటీనా ఏకతాటిపై రావాలి: మెస్సి

Updated Date - Oct 07 , 2026 | 03:31 PM