Share News

ప్రేమానంద్ ఆశ్రమానికి వెళ్లేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు.. క్లారిటీ

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:55 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీపై వచ్చిన సంచలన ఆరోపణలను ఆయన ప్రతినిధి ఖండించారు. ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు చెల్లించారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.

ప్రేమానంద్ ఆశ్రమానికి వెళ్లేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు.. క్లారిటీ
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీపై వచ్చిన సంచలన ఆరోపణలను ఆయన ప్రతినిధి ఖండించారు. ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు చెల్లించారంటూ శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్‌ న్యాస్‌ అధ్యక్షుడు ఫలహారీ మహారాజ్‌ దినేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. కోహ్లీ ప్రేమానంద్‌ మహారాజ్‌ను భక్తి, గౌరవంతోనే కలుస్తారని స్పష్టం చేశారు.


కోహ్లీ టీమ్‌లో ఓ ప్రతినిధి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘విరాట్‌ కోహ్లీకి సంబంధించి ఫలహారీ మహారాజ్‌ దినేశ్‌ శర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, వాస్తవాలకు విరుద్ధమైనవి. విరాట్‌ కోహ్లీ ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని కేవలం తనకు ఉన్న విశ్వాసం, గౌరవంతోనే సందర్శిస్తారు. మీడియా సంస్థలు ఇలాంటి వ్యాఖ్యలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. బాధ్యతాయుతంగా వ్యవరించాలి’ అని పేర్కొన్నారు.


అసలేంటీ రూ.5 కోట్ల ఆరోపణ?

ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమంలో ఓ శిష్యుడు అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఆశ్రమం వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఫలహారీ మహారాజ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రేమానంద్‌ మహారాజ్‌ ప్రాచుర్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగానే విరాట్‌ కోహ్లీని ఆశ్రమానికి తీసుకురావడానికి రూ.5 కోట్లు చెల్లించారంటూ ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మకు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు నిర్ధారించే ఆధారాలు లభించలేదని సమాచారం.


ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 07 , 2026 | 01:55 PM