శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో తొలిసారి టాప్-10.. టీ20 ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు జంప్
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:17 PM
లఖ్‌నవూ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీతో అలరించాడు. అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ తో 170పైగా ఉన్న టార్గెట్‌ను కూడా భారత జట్టు సునాయసంగా ఛేదించేసింది.
స్పోర్ట్స్ డెస్క్: లఖ్‌నవూ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Captain Shreyas Iyer) సూపర్ సెంచరీతో అలరించాడు. అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ తో 170పైగా ఉన్న టార్గెట్‌ను కూడా భారత జట్టు సునాయసంగా ఛేదించేసింది. అయ్యర్ అంతర్జాతీయ కెరీర్‌లో అదే తొలి టీ20 సెంచరీ. తొలి టీ20లో చేసిన అద్భుత ప్రదర్శనతో తాజాగా విడుదలైన ర్యాంకుల్లో మెరుగైన ఫలితాలు సాధించాడు. ఏకంగా 18 స్థానాలు ఎగబాకిన శ్రేయస్ అయ్యర్.. తన కెరీర్‌లో తొలిసారి టాప్ -10లోకి దూసుకొచ్చాడు.
తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 ర్యాంకుల్లో బ్యాటింగ్ విభాగంలో శ్రేయస్ 786 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ విభాగంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇషాన్ కిషన్ (902), అభిషేక్ శర్మ (887) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆసియా క్రీడలు 2026ఫైనల్‌లో అర్ధ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తిలక్ వర్మ (719) తొమ్మిది నుంచి పదవ స్థానంకు పడిపోయాడు. శ్రేయస్ ముందుకు రావడమే తిలక్ ర్యాంకుపడిపోవడానికి కారణం. ఇక తొలి టీ20లో అర్ధ శతకంతో రాణించిన వెస్టిండీస్ ప్లేయర్ రూథర్‌ఫోర్డ్ 10 స్థానాలు ఎగబాకి 37వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 బౌలింగ్‌ల విభాగంలో అక్షర్ పటేల్ 16 స్థానాలు, జస్ప్రీత్ బుమ్రా మూడు స్థానాలు మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతం అక్షర్ 7వ, బుమ్రా పదో ర్యాంకుల్లో ఉన్నారు. రషీద్ ఖాన్ నంబర్ 1 బౌలర్ గా నిలిచాడు.
మరోవైపు ఐసీసీ విడుదల చేసిన వన్డే ఫార్మాట్‌లో భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో అతడు ద్విశతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, మూడో మ్యాచ్‌లో త్వరగా పెవిలియన్‌కు చేరినప్పటికీ.. అది అతడి ర్యాంక్‌పై ప్రభావం చూపలేదు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (781) మూడో స్థానానికి పడిపోయాడు. కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ (794) టాప్-2లోకి రాగా... రోహిత్ తన నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానంలో నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
తన్మయ్ బలోడా ప్రపంచ రికార్డు.. యూత్ టెస్టులో 14 వికెట్లతో సౌథీ రికార్డు బద్దలు
అనుష్క మైదానంలో ఉంటే కోహ్లీ సెంచరీ ఖాయం: రవిశాస్త్రి
అజిత్ అగార్కర్‌కు గంభీర్ భావోద్వేగ వీడ్కోలు.. ‘చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు’
ఇవి కూడా చదవండి:
తన్మయ్ బలోడా ప్రపంచ రికార్డు.. యూత్ టెస్టులో 14 వికెట్లతో సౌథీ రికార్డు బద్దలు
అనుష్క మైదానంలో ఉంటే కోహ్లీ సెంచరీ ఖాయం: రవిశాస్త్రి
హర్మన్-స్మృతి మధ్య విభేదాలు? కారణం అదేనా..