అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్
ABN , Publish Date - Nov 04 , 2026 | 08:42 PM
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. పది ఓవర్ల కోటాలో 70 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. పది ఓవర్ల కోటాలో 70 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా కివీస్ 185 పరుగులకే ఆలౌట్ కావడంలో అర్ష్‌దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్రశంసించాడు. అంతేకాక బీసీసీఐ సెలక్టర్లకు ఆయన కీలక సూచనలు చేశాడు.
ఓ స్పోర్ట్స్ ఛానల్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. 'అర్ష్‌దీప్ సింగ్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలుగుతున్నాడు. ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ రాబడుతున్నాడు. తద్వారా బ్యాటర్లను ఇబ్బంది పెట్టడటంలో అతడు సక్సెస్ అయ్యాడు. ఇవాళ జరిగిన తొలి వన్డేలో అతడి లైన్ అండ్ లెంగ్త్ అత్యంత అద్భుతంగా ఉంది. గత రెండు, మూడేళ్లుగా అతడి ఆటను చూస్తున్నా. టెస్టుల్లో కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించాలి. వైట్‌బాల్‌నే ఇంతలా స్వింగ్ చేస్తున్నాడంటే.. రెడ్‌బాల్ క్రికెట్‌లో ఎలాంటి అద్భుతాలు చేయగలడో చూడాలి’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఇదే షోలో పాల్గొన్న టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే సైతం గావస్కర్ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. అర్ష్‌దీప్‌నకు కచ్చితంగా టెస్టుల్లోనూ అవకాశం వస్తుదంని తెలిపాడు. అతడిలో బంతిని అద్భుతంగా స్వింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయగల నైపుణ్యం ఉందని రహానే పేర్కొన్నాడు. రెడ్‌బాల్‌తోనూ ఈ లెఫ్టార్మ్ సీమర్ రాణించగలడని రహానే అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
సింగిల్ హ్యాండ్‌తో విరాట్ కోహ్లీ డైవింగ్ క్యాచ్.. వీడియో చూశారా!
ఐపీఎల్ 2027: తెరపైకి మరో ట్రేడ్ డీల్.. రూ.13 కోట్ల స్టార్ క్రికెటర్‌పై సీఎస్కే కన్ను!
WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ