న్యూజిలాండ్ బ్యాటర్‌ను రెచ్చగొట్టిన గుర్నూర్ బ్రార్! వీడియో వైరల్...
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:47 PM
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్, కివీస్ టెయిలెండర్ బ్లెయిర్ టిక్నర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్, కివీస్ టెయిలెండర్ బ్లెయిర్ టిక్నర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. చివరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన టిక్నర్ అనూహ్యమైన బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతున్న టిక్నర్కు గుర్నూర్ బ్రార్ రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడాలని, షార్ట్ బాల్ వేస్తానన్నట్లు టిక్నర్ కు గుర్నూర్ సైగల్ చేశాడు. ఈ స్లెడ్జింగ్‌కు టిక్నర్ తనదైన శైలిలో స్పందించాడు. వికెట్ల వెనుకకు వెళ్లి సైగలు చేశాడు. చెప్పినట్లుగానే గుర్నూర్ షార్ట్ బాల్ వేయగా.. టిక్నర్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి వికెట్ కీపర్‌వైపు దూసుకెళ్లగా.. కేఎల్ రాహుల్ జంప్ చేసి సులువుగా క్యాచ్ అందుకున్నాడు. ఆ వెంటనే గుర్నూర్ బ్రార్ గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకుంటూ టిక్నర్ వైపు పరుగెత్తాడు. అతడు కూడా అంతే సరదాగా నవ్వుతూ స్పందించాడు. బౌలర్, బ్యాటర్ మధ్య ఉన్న ఈ క్రీడాస్ఫూర్తి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. టెయిలెండర్ టీమ్ సీఫెర్ట్( 38),బ్లెయిర్ టిక్నర్(34 ) టాప్ స్కోరర్లుగా నిలిచారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ 3, అన్షుల్ కాంబోజ్ 2 సాధించాడు.
ఇవి కూడా చదవండి:
తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
సింగిల్ హ్యాండ్‌తో విరాట్ కోహ్లీ డైవింగ్ క్యాచ్.. వీడియో చూశారా!
మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి.. మస్క్ సెటైర్లు