సింగిల్ హ్యాండ్‌తో విరాట్ కోహ్లీ డైవింగ్ క్యాచ్.. వీడియో చూశారా!
ABN , Publish Date - Nov 04 , 2026 | 10:52 AM
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫీల్డింగ్ విన్యాసాలతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 37 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని ఫిట్‌నెస్‌తో అదరగొడుతున్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. ఆ తర్వాత తనదైన శైలిలో చేసిన సెలబ్రేషన్ మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత బౌలర్ అన్షుల్ కాంబోజ్ వేసిన బంతిని న్యూజిలాండ్ బ్యాటర్ నాథన్ స్మిత్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తగిలి సెకండ్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ క్షణాల్లో స్పందించాడు. తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ బంతి నేలను తాకకముందే ఒడిసిపట్టాడు. ఆ వెంటనే క్యాచ్ క్లీన్‌గా అందుకున్నానని చేతితో సైగలు చేశాడు. కోహ్లీ రియాక్షన్ టైమింగ్, డైవింగ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. క్యాచ్ అందుకున్న తర్వాత కోహ్లీ చేసిన సంబరాలు మరింత ఆకట్టుకున్నాయి. విల్లు ఎక్కుపెట్టినట్లుగా 'బౌ-అండ్-యారో' స్టైల్‌లో సెలబ్రేషన్ చేశాడు. ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్ నెగ్గిన భారత్
వైభవ్‌ను నెమ్మదిగా ఎదగనివ్వండి.. తొందరపాటు నిర్ణయాలు వద్దు: సచిన్ టెండూల్కర్