వన్డేల్లో విరాట్ వరల్డ్ రికార్డు.. మూడో స్థానంలో 13వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా..
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:36 PM
భారత స్టార్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ ఈ రికార్డును అందుకున్నాడు. కోహ్లీకి ఈ మైలురాయిని చేరుకోవడానికి కేవలం 12 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో తన 13వ బంతిని ఎదుర్కొన్న సమయంలోనే ఈ ఘనతను సాధించాడు.
251 ఇన్నింగ్స్‌ల్లోనే..
కోహ్లీ ఈ రికార్డును కేవలం 251 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం విశేషం. మూడో స్థానంలో అతడి బ్యాటింగ్ సగటు 61.55గా ఉంది. ఈ స్థానంలో ఇప్పటివరకు 48 సెంచరీలు, దాదాపు 70 అర్ధసెంచరీలు సాధించాడు. వన్డే క్రికెట్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా అతడి ఆధిపత్యానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఇప్పటివరకు వన్డేల్లో నంబర్ 3 స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ తన కెరీర్‌లో 330 ఇన్నింగ్స్‌ల్లో 12,662 పరుగులు సాధించాడు. ఇప్పుడు కోహ్లీ 13 వేల పరుగుల మార్కును దాటి రికీ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే చరిత్రలో మూడో స్థానంలో 10 వేల పరుగుల మార్కును దాటిన ఆటగాళ్లు కోహ్లీ, పాంటింగ్ మాత్రమే కావడం గమనార్హం.
నంబర్ 3లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే..
విరాట్ కోహ్లీ(భారత్) – 13,000 పరుగులు
రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా) – 12,662 పరుగులు
కుమార సంగక్కర(శ్రీలంక) – 9,747 పరుగులు
జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా) – 7,774 పరుగులు
కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) – 6,504 పరుగులు
బాబర్ ఆజం(పాకిస్థాన్) – 6,054 పరుగులు
జో రూట్(ఇంగ్లండ్) – 5,525 పరుగులు
ఇవి కూడా చదవండి:
తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
సింగిల్ హ్యాండ్‌తో విరాట్ కోహ్లీ డైవింగ్ క్యాచ్.. వీడియో చూశారా!