ఆ ఇద్దరు నా ఫేవరెట్ కెప్టెన్లు.. సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:22 PM
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తాజాగా తనకు ఇష్టమైన కెప్టెన్లు ఎవరో వెల్లడించాడు. భారత జట్టుకు తాను కూడా కొంతకాలం సారథ్యం వహించినప్పటికీ.. తన కెరీర్లో ఎంతోమంది దిగ్గజ కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తాజాగా తనకు ఇష్టమైన కెప్టెన్లు ఎవరో వెల్లడించాడు. భారత జట్టుకు తాను కూడా కొంతకాలం సారథ్యం వహించినప్పటికీ.. తన కెరీర్లో ఎంతోమంది దిగ్గజ కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు. ముఖ్యంగా సౌరభ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. తాజాగా ఓ కార్యక్రమంలో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన ఫేవరెట్ కెప్టెన్ల పేర్లను వెల్లడించాడు.
‘భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఎలా ఉంది? ఆ బాధ్యతలకు అలవాటు పడటం ఎంత కష్టమైంది? మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు?’ అంటూ సచిన్‌ను ఓ అభిమాని ప్రశ్నించాడు. ‘భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావించాను. అయితే జట్టును పూర్తిగా నా ఇష్టానుసారం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఎప్పుడూ ఉండేది కాదు. నాటితో పోలిస్తే ప్రస్తుతం బీసీసీఐ చాలా అభివృద్ధి చెందింది. వృత్తి పరమైన సంస్థగా ఎదిగింది. భారత క్రికెట్ ఆ సమయంలో చాలా క్లిష్టమైన దశను ఎదుర్కొంది. నేను కూడా కెప్టెన్‌గా జట్టుకు కొంతకాలం సేవలు అందించాను. కానీ నా ఫేవరేట్ కెప్టెన్లు మాత్రం సౌరభ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని’ అని సచిన్ వెల్లడించాడు.
ఇక టెస్టుల్లో అదరగొడుతున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాపై కూడా సచిన్ ప్రశంసలు కురిపించాడు. ‘బవుమా పోరాట స్ఫూర్తిని నేను నిజంగా అభినందిస్తాను. ముందుండి జట్టును నడిపిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు అద్భుతమైన ఫలితాలు అందించాడు. దక్షిణాఫ్రికా ఐసీసీ టైటిల్ గెలవడం ప్రపంచ క్రికెట్‌కు కూడా ఎంతో మంచిది’ అని సచిన్ ప్రశంసించాడు.
ఇవి కూడా చదవండి:
తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
సింగిల్ హ్యాండ్‌తో విరాట్ కోహ్లీ డైవింగ్ క్యాచ్.. వీడియో చూశారా!