Share News

తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:10 AM

ఆక్లాండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది.

తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
India vs New Zealand

ఇంటర్నెట్ డెస్క్: ఆక్లాండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 186 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ టిమ్ సీఫర్ట్(38) టాప్ స్కోరర్.


గ్లెన్ ఫిలిప్స్(30), టిక్నర్(34), డారిల్ మిచెల్(28), డఫీ(18*) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. విల్ యంగ్(9), నికోల్స్(9), టామ్ లాథమ్(3), శాంట్నర్(4), స్మిత్(1), జెమీసన్(1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4, గుర్నూర్ బ్రార్ 3, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లతో చెలరేగారు.


ఇవి కూడా చదవండి:

సింగిల్ హ్యాండ్‌తో విరాట్ కోహ్లీ డైవింగ్ క్యాచ్.. వీడియో చూశారా!

ఐపీఎల్ 2027: తెరపైకి మరో ట్రేడ్ డీల్.. రూ.13 కోట్ల స్టార్ క్రికెటర్‌పై సీఎస్కే కన్ను!

Updated Date - Nov 04 , 2026 | 11:21 AM