Share News

బాబుకు మోదీ ఫోన్.. ఆర్నబ్, మురసు ప్రభావంపై ఆరా

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:00 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంపై మోదీ ఆరా తీశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి గురించి చంద్రబాబును మోదీ అడిగి తెలుసుకున్నారు.

బాబుకు మోదీ ఫోన్.. ఆర్నబ్, మురసు ప్రభావంపై ఆరా

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంపై మోదీ ఆరా తీశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి గురించి చంద్రబాబును మోదీ అడిగి తెలుసుకున్నారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ప్రధానికి చంద్రబాబు వివరించారు.


భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు. అలాగే రహదారులు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని వెల్లడించారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా.. తుఫాన్ సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని మోదీ ప్రశంసించారు. తుఫాన్ వల్ల వచ్చిన ఇబ్బందులను నిరంతర అప్రమత్తతతో సమర్థవంతంగా అధిగమించారని సీఎం చంద్రబాబును ప్రధాని కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలే లక్ష్యం.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ పుర పోరులో కూటమి గెలుపు హోరు

Updated Date - Nov 04 , 2026 | 02:00 PM