కళ్లతో కసరత్తులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఇమిటేట్ చేసిన రవిశాస్త్రి
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:33 PM
ఆక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కళ్ల కసరత్తును కామెంటరీ బాక్స్‌లో ఉన్న రవిశాస్త్రి అనుకరించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(74) పరుగులతో రాణించి.. టీమిండియా విజయంలో కీలత పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఐదో మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కళ్ల కసరత్తును కామెంటరీ బాక్స్‌లో ఉన్న రవిశాస్త్రి అనుకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో డగౌట్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఏకాగ్రత కోసం అతడు తన రెండు కళ్లను అటూఇటూ తిప్పుతూ తనదైన శైలీలో కసరత్తులు చేశాడు. అదికాస్తా గ్రౌండ్లో ఉన్న పెద్ద స్క్రీన్‌పై కనిపించింది. ఈ అసాధారణమైన కదలిక మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అలానే తన కళ్ల కసరత్తులను పెద్ద స్క్రీన్‌పై చూసిన శ్రేయస్ అయ్యర్ తెగ నవ్వేశాడు.
మరోవైపు కామెంటరీ బాక్స్‌లో ఉన్న రవిశాస్త్రి కూడా అయ్యర్ కసరత్తులను గమనించాడు. అంతేకాక శ్రేయస్ అయ్యర్‌ను ఇమిటేట్ చేశాడు. అయితే అయ్యర్ చేసిన కళ్ల వ్యాయామం అనేది శిక్షణలో ఒక అంశమని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఇది బ్యాటర్లకు వేగంగా వస్తున్న బంతిపై ఏకాగ్రత్తను మెరుగుపరచడానికి, చేతి-కంటి సమన్వయాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందట. మొత్తంగా మైదానం లోపలే కాకుండా వెలుపల జరిగే సంఘటనలు కూడా కొన్నిసార్లు క్రికెట్‌తో సమానంగా వినోదాన్ని అందిస్తాయని ఈ ఘటన నిరూపించింది.
ఇవి కూడా చదవండి:
సింగిల్ హ్యాండ్‌తో విరాట్ కోహ్లీ డైవింగ్ క్యాచ్.. వీడియో చూశారా!
ఐపీఎల్ 2027: తెరపైకి మరో ట్రేడ్ డీల్.. రూ.13 కోట్ల స్టార్ క్రికెటర్‌పై సీఎస్కే కన్ను!