Share News

టీ20 ఆసియా కప్ 2026: స్మృతి మంధాన ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Aug 30 , 2026 | 09:13 PM

మహిళల టీ20 ఆసియా క‌ప్ 2026 టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

టీ20 ఆసియా కప్ 2026: స్మృతి మంధాన ప్రపంచ రికార్డు
Smriti Mandhana

స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ఆసియా క‌ప్ 2026 టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సుజీ బేట్స్ (10,740 పరుగులు)ను అధిగమించింది.


ప్రస్తుతం మంధాన మూడు ఫార్మాట్లు కలిపి 10,750 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత దిగ్గజం మిథాలీరాజ్10,868 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. సుజీ బేట్స్ మూడో స్థానంలో ఉంది. చార్లెట్ ఎడ్‌వర్డ్స్(ఇంగ్లండ్) 10,273 పరుగులు, స్టెఫానీ టేలర్ 10,007 పరుగులతో నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే... టాస్ గెలిచిన థాయ్‌లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన 19 పరుగుల వద్ద రనౌటైంది. భార‌త్ త‌ర‌ఫున ప్రతీక్ రావ‌ల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సంద‌ర్భంగా కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావ‌ల్ క్యాప్‌ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావ‌డంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్‌కు అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు హర్మన్ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్

Updated Date - Aug 30 , 2026 | 09:23 PM