Share News

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. పాక్ బౌలర్ అరుదైన ఫీట్

ABN , Publish Date - Aug 30 , 2026 | 08:18 PM

పాకిస్థాన్ ఫాస్ట్‌ బౌల‌ర్ మ‌హ్మద్ అబ్బాస్ ఇంగ్లండ్‌ గడ్డపై అరుదైన ఘనతను సాధించాడు. లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో అబ్బాస్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. పాక్ బౌలర్ అరుదైన ఫీట్
Mohammad Abbas

స్పోర్ట్స్ డెస్క్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో పాక్ స్టార్ పేసర్ మ‌హ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లు పడగొట్టి అరుదైన ఫీట్ సాధించాడు. లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన ఏడో పాకిస్థాన్ బౌల‌ర్‌గా రికార్డులోకెక్కాడు. అయితే పాక్‌ దిగ్గజ బౌలర్‌గా పేరొందిన వసీం అక్రమ్‌కు మాత్రం లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్ల హాల్‌ లేకపోవడం గమనార్హం. అబ్బాస్‌ ఐదు వికెట్ల ఫీట్‌తో లార్డ్స్ హాన‌ర్స్ బోర్డులోనూ స్థానం సంపాదించాడు.


ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అబ్బాస్‌కు ఇదే మొద‌టి ఐదు వికెట్ల హాల్ కాగా, టెస్టుల్లో ఇది 8వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన కావ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా మ‌హ్మద్ అబ్బాస్ 32 టెస్టుల్లో 128 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ్యాచ్ విష‌యానికొస్తే.. 389 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ నాలుగో రోజు లంచ్ విరామ స‌మ‌యానికి 3 వికెట్లు కోల్పోయి 53 ప‌రుగులు చేసింది. అలానే 30 ఓవర్లు ముగిసేసరికి 111 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో సాద్ ష‌కీల్ (63), షాన్ మ‌సూద్ (26) క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు ఇంగ్లండ్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 208 ప‌రుగుల‌కు ఆలౌటైంది.


లార్డ్స్‌లో ఐదు వికెట్లు తీసిన పాక్‌ బౌలర్లు

  • ఖాన్ మ‌హ్మద్ (1956)

  • ముద‌స్సర్ న‌జ‌ర్ (1982)

  • వ‌కార్ యూనిస్ (1992)

  • ముస్తాక్ అహ్మద్ (1996)

  • మ‌హ్మద్ ఆమిర్ (2010)

  • యాసిర్ షా (2016)

  • మ‌హ్మద్ అబ్బాస్ (2026)


ఇవి కూడా చదవండి:

ఇమ్రాన్ ఖాన్ జైలు అంశంపై మాట్లాడొద్దు.. పాక్ క్రికెటర్లకు పీసీబీ కీలక సూచన

ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా గౌతమ్ గంభీర్ కూతురు ఆజీన్

Updated Date - Aug 30 , 2026 | 09:12 PM