ఇమ్రాన్ ఖాన్ జైలు అంశంపై మాట్లాడొద్దు.. పాక్ క్రికెటర్లకు పీసీబీ కీలక సూచన
ABN , Publish Date - Aug 30 , 2026 | 07:01 PM
మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష విషయంపై పాక్ క్రికెటర్లు స్పందించ వద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సూచించింది. అలానే ఇమ్రాన్ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష విషయంపై పాక్ క్రికెటర్లు స్పందించ వద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సూచించింది. అలానే ఇమ్రాన్ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. ఇటీవల ఇమ్రాన్ వ్యవహారంపై పాకిస్థానీ క్రికెటర్లు స్పందించేలా ఇంగ్లండ్ మీడియా ప్రయత్నించిన నేపథ్యంలో పీసీబీ ఈ సూచనలు చేసింది.
ఇమ్రాన్ ఖాన్‌ను చంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం యత్నిస్తోందని, ఆయన మూడేళ్లుగా జైలులో నరకం అనుభవిస్తున్నారని ఇమ్రాన్ కుమారులు ఇటీవలే మాజీ క్రికెటర్ మైక్ అథర్టన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఆటగాళ్లకు పీసీబీ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ కుమారులు ఇంటర్వ్యూను మీ ప్లేయర్లు చూశారా? అని పాక్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను మీడియా అడిగింది.
తమ ఆటగాళ్లు భోజనం చేస్తూ ఉండటంతో ఆ ఇంటర్వ్యూను చూడలేదని సర్ఫరాజ్ సమాధానం ఇచ్చాడు. అలానే స్కై స్పోర్ట్స్ ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేస్తే, లంచ్ విరామం తర్వాత తమ జట్టును బరిలోకి దించబోమని పీసీబీ బెదిరించిందన్న వార్తలను కూడా మీడియా లేవనెత్తింది. 'ఆ విషయం గురించి మాకు ఏమీ తెలియదు. మేము భోజనం చేస్తున్నాము' అని సర్ఫరాజ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా గౌతమ్ గంభీర్ కూతురు ఆజీన్
పాకిస్థాన్ క్రికెట్‌తో నా సంబంధం ముగిసింది.. మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన!