ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా గౌతమ్ గంభీర్ కూతురు ఆజీన్
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:24 PM
టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుమార్తె ఆజీన్ గంభీర్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఆమెను సత్కరించింది
స్పోర్ట్స్ డెస్క్: భారత్ క్రికెట్ జట్టు హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుమార్తె ఆజీన్ గంభీర్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఆమెను సత్కరించింది. ఇవాళ(ఆదివారం) ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 88వ 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమంలో ఈ ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గౌతమ్ గంభీర్ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఫిట్‌నెస్, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించే ప్రచారంలో యువతను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆదివారం ఉదయం ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి సైకిల్ తొక్కడం ద్వారా శారీరకంగా చురుకుగా ఉండేలా ప్రోత్సహించడమే ఈ ప్రచారం లక్ష్యం. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ చొరవతో 'సండేస్ ఆన్ ఎ సైకిల్'ను డిసెంబర్ 2024లో ప్రారంభించారు.
ఈ క్రమంలోనే 12 ఏళ్ల ఆజీన్ గంభీర్‌ను ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. గౌతమ్ గంభీర్ కూతురికి లభించిన ఈ గౌరవం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే గంభీర్ స్వయంగా ఫిట్‌నెస్, క్రమశిక్షణతో కూడిన కెరీర్‌ను గడిపాడు. అలాంటి గంభీర్ శిక్షణలో ఈ ఏడాది టీమిండియా టీ20 ప్రపంచ కప్‌ను గెలవగా.. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గౌతమ్ గంభీర్ 2011 అక్టోబర్ 28న నటాషా జైన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఆజీన్, అనైజా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ క్రికెట్‌తో నా సంబంధం ముగిసింది.. మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో టీమిండియా దిగ్గజం