Share News

పాకిస్థాన్ క్రికెట్‌తో నా సంబంధం ముగిసింది.. మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన!

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:39 PM

పాకిస్థాన్ జట్టు తరఫునే ఆడే ప్రసక్తే లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్, సీనియర్ పేసర్ మహమ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే అతడు బ్రిటీష్ పౌరసత్వం పొందిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ క్రికెట్‌తో నా సంబంధం ముగిసింది.. మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన!
Mohammad Amir

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ జట్టు తరఫునే ఆడే ప్రసక్తే లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్, సీనియర్ పేసర్ మహమ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే అతడికి బ్రిటీష్ పౌరసత్వం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు తిరిగి పాకిస్థాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే పునరాగమనంపై వస్తున్న ఊహాగానాలకు ఆమిర్ తెరదించాడు. ప్రఖ్యాత యూట్యూబ్ ఛానల్ ‘ఫుర్కాన్ భట్టి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమిర్ ఈ కీలక విషయాలను వెల్లడించాడు.


తన భార్య నర్జిస్ ఖాన్ ద్వారా ఆమిర్ బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' టోర్నీ, అలాగే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లలో విదేశీ ఆటగాడిగా కాకుండా స్థానిక ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. అయితే ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో స్థానిక ఆటగాడిగా ఆడాలంటే.. అక్కడి నిబంధనల ప్రకారం వేరే దేశం తరఫున ప్రాతినిధ్యం వహించకూదు. ఆ మేరకు ఓ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. 'నేనిప్పుడు ఇంగ్లండ్ పౌరుడిని అయ్యాను. ఇక్కడి నిబంధనల కారణంగా పాకిస్థాన్‌తో నా అధ్యాయం ముగిసింది' అని ఆమిర్ తేల్చిచెప్పాడు.


తన కెరీర్‌కు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తన ప్రాధాన్యతగా ఉంటుందని, 2027 పీఎస్‌ఎల్‌లో తాను విదేశీయ ఆటగాడిగా ఆడతానని తెలిపాడు. ఇక ఐపీఎల్ (IPL)లో ఆడే అంశంపై స్పందిస్తూ.. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాడు. గతంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ అజహర్ మహమూద్ కూడా బ్రిటీష్ పౌరసత్వం పొంది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల తరఫున ఆడాడు. ఏదేమైనా, ఒకప్పుడు పాకిస్థాన్ పేస్ దళంలో ప్రధాన బౌలర్‌గా ఉండి, అనేక వివాదలతో తరచూ వార్తల్లో నిలిచే వాడు. అలానే బ్రిటీష్ పౌరసత్వం తీసుకున్న తర్వాత కూడా తిరిగి పాకిస్థాన్ జట్టులోకి వస్తాడనే ఊహాగానాలకు ఆమిర్ చేసిన ఈ తాజా ప్రకటనతో అధికారికంగా తెరపడినట్లయింది.


ఇవి కూడా చదవండి:

సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో టీమిండియా దిగ్గజం

కెప్టెన్‌గా తొలి డీఆర్ఎస్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ..

Updated Date - Aug 30 , 2026 | 05:47 PM