సైప్రస్ తీరంలో 267 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:40 PM
పశ్చిమాసియాలోని సైప్రస్ సమీపంలో 267 ప్రయాణికులతో ఉన్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలోని సైప్రస్ సమీపంలో 267 మంది ప్రయాణిస్తున్న పడవ ఈరోజు (ఆదివారం) బోల్తా పడింది. నీరు చేరుకోవడం వల్ల ఆ పడవ ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కైరినియా నుంచి టర్కీలోని టౌచుకు బయలుదేరిన ఈ పడవలో 259 ప్రయాణికులు సహా 8 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రమాదం జరిగిన కొంతసేపటికే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 159 మందిని కాపాడినట్టు సమాచారం. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కోస్ట్ గార్డ్ ఓడలు, హెలికాప్టర్లు, సివిలియన్ పడవలతో సహాయక చర్యలను చేపట్టారని స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే కైరినియా పోర్ట్ వద్ద అంబులెన్స్‌లను కూడా ఉంచారని వివరించింది. లైఫ్ జాకెట్లు ధరించడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదని చెప్పింది. అయితే.. ఈ పడవ నాలుగు మైళ్ల వరకు నీటితోనే ప్రయాణించిందని పేర్కొంది.
ఇవీ చదవండి:
ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు
షార్ప్ బ్రెయిన్ కావాలా?.. రోజువారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..