Share News

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:29 PM

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కొలంబోలో ప్రాక్టీస్ చేస్తుండగా భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!
Shubman Gill Injury

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ వంటి ప్లేయర్లు గాయాల కారణంగా సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టుకు మరో దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే...


శ్రీలంక, భారత్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ప్రారంభంకానున్న తొలి మ్యాచ్ కోసం ఇవాళ(గురువారం) కొలంబోలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ పేసర్ వేసిన బంతి గిల్ కుడి బొటనవేలికి బలంగా తగిలింది. దీంతో తీవ్ర నొప్పితో విలవిల్లాడిన అతడికి వెంటనే ఫిజియో చికిత్స అందించారు. అయితే గాయం తీవ్రమైనది కాకపోవడంతో కొద్దిసేపటి తర్వాత గిల్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.


ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ మరో ఘటన చోటుచేసుకుంది. ఫీల్డింగ్ డ్రిల్స్ సమయంలో స్లిప్స్‌లో క్యాచ్‌లు పట్టడంపై ప్రాక్టీస్ చేస్తుండగా అతడి కుడి చేతికి మరోసారి గాయమైంది. దీంతో ఫిజియో ఐస్ ప్యాక్‌తో చికిత్స అందించారు. అనంతరం కూడా నొప్పి తగ్గకపోవడంతో గిల్ మైదానం వీడినట్లు తెలుస్తోంది. ఇక గిల్ గాయంపై టీమిండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించాడు.


ఇవి కూడా చదవండి:

మ్యాచ్ జరుగుతుండగా పడిన పిడుగు.. ప్లేయర్ మృతి

వైభవ్.. సచిన్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాడు: రాబిన్ ఉతప్ప

Updated Date - Aug 06 , 2026 | 06:17 PM