Share News

స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక.. చివరకు!

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:05 PM

నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు, ఇంటర్ విద్యార్థినిని రెండు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక.. చివరకు!
Nagpur Crime News

మహారాష్ట్ర, ఆగస్టు 06: ఇటీవల కాలంలో ప్రత్యక్షంగా ఏర్పడే స్నేహాల కంటే సోషల్ మీడియా ద్వారా ఏర్పడే స్నేహాలే ఎక్కువయ్యాయి. ఇలాంటి స్నేహాల కారణంగా కొందరు యువతులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు కిడ్నాప్, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇలాంటి స్నేహం కారణంగానే తాజాగా నాగ్‌పూర్‌కు చెందిన ఓ బాలిక చావు అంచుల వరకు వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 20 ఏళ్ల యువకుడు, ఇంటర్ విద్యార్థినిని రెండు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా అత్యంత క్రూరంగా హింసించాడు.


నాగ్‌పూర్‌కు చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతుంది. ఇటీవల స్నేహితుల దినోత్సవం సందర్భంగా మాల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యువతి ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా థానేకు చెందిన నిర్భయ్ అలియాస్ ఆకాశ్ మాధవ్ పాఖ్రే వద్ద ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి తల్లి ద్వారా ఫోన్ చేయించి, ఆపై ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ సహాయంతో కచ్చితమైన అడ్రస్‌ను పోలీసులు కనిపెట్టారు.


అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా అక్కడ భయానక దృశ్యం కనిపించింది. బాధితురాలిని మంచానికి కట్టేసి ఉండగా.. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె చేతి మణికట్టు తెగిపోయి ఉంది. పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. వ్యక్తిగత ఫోటోలు తీసి, బాలిక కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించి నిందితుడు ఈ అరాచకానికి పాల్పడినట్లు తేలింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం, అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడులో మళ్లీ 'తమిళ్ తాయ్ వాళ్తు' వివాదం.. గవర్నర్‌కు 21 మంది ఎంపీల లేఖ

అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి

Updated Date - Aug 06 , 2026 | 03:23 PM