రిషబ్ పంత్ రీఎంట్రీలో బిగ్ ట్విస్ట్.. న్యూజిలాండ్ ‘ఎ’తో మూడో అనధికారిక టెస్ట్‌కు దూరం!
ABN , Publish Date - Nov 01 , 2026 | 06:50 PM
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్‌తో జరిగే అనధికారిక టెస్ట్‌లో ఆడనున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడి రీఎంట్రీలో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మరోసారి గాయం రూపంలో పంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్‌తో జరిగే అనధికారిక టెస్ట్‌లో ఆడనున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడి రీఎంట్రీలో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మరోసారి గాయం రూపంలో పంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరగనున్న మూడో, ఆఖరి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఇరాని కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్న సమయంలో పంత్ ఎడమ వైపు కండరాల నొప్పితో (Left-side strain) ఇబ్బంది పడ్డాడు.
బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నప్పటికీ, నవంబర్ 7 నుంచి లింకన్ వేదికగా ప్రారంభంకానున్న న్యూజిలాండ్‌తో జరిగే అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశం లేదని ఓ స్పోర్ట్స్ మీడియా తన నివేదికలో పేర్కొంది. ఈ పర్యటనలోని తొలి రెండు అనధికారిక టెస్టులకు పంత్ ఇప్పటికే దూరమవ్వగా.. అతడి స్థానంలో జార్ఖండ్ వికెట్ కీపర్ కుమార్ కుషాగ్రాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. షార్డా కేర్ హెల్త్‌సిటీ ఆర్థోపెడిక్స్ డైరెక్టర్ డాక్టర్ పుష్కర్ చావ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఎడమ వైపు కండరాల ఒత్తిడి (Left-side strain) అనేది శరీర ఎడమ వైపు భాగంలోని కండరాలకు తగిలే గాయం.
ముఖ్యంగా పక్కవరుసల మధ్య ఉండే అంతర కండరాలు లేదా ఉదర భాగానికి చెందిన వక్ర కండరాలు (Oblique muscles) దీనివల్ల దెబ్బతింటాయి. క్రికెటర్లు బ్యాటింగ్ చేసేటప్పుడు, వికెట్ కీపింగ్, రన్నింగ్ లేదా బంతులు విసిరే సమయంలో శరీరాన్ని విపరీతంగా తిప్పాల్సి వస్తుంది. ఈ క్రమంలో కండరాలు అతిగా సాగడం లేదా చిట్లిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ గాయం నుంచి కోలుకునే సమయం పూర్తిగా దాని తీవ్రత, ఆటగాడి శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పంత్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి దిగాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
ఇరాన్‌లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్
జపాన్‌ను కుదిపేసిన భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత