భార్య ముచ్చట పడిందని.. ముందూవెనుకా ఆలోచించక..
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:46 PM
లగ్జరీ కార్లలో తిరగాలన్న భార్య ముచ్చట తీర్చేందుకు ఓ వ్యక్తి ఖరీదైన కారు చోరీ చేసిన ఘటన భోపాల్‌లో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: లగ్జరీ కార్లలో తిరగాలన్న భార్య ముచ్చట తీర్చేందుకు ఓ వ్యక్తి ఖరీదైన కారు చోరీ చేసిన ఘటన భోపాల్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న గజేంద్ర అలియాస్ రిషీ ఆనంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని నర్మదాపురం రోడ్డులోని అషీమా మాల్‌లోగల ఫోక్స్‌వ్యాగన్ షోరూంలో ఈ ఘటన జరిగింది. షోరూమ్‌లో కార్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తుండగా సిబ్బందికి చోరీ విషయం గురించి తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రిషీ ఆనంద్ స్వస్థలం హోషంగాబాద్. అతడు తన భార్యతో కలిసి భోపాల్ అశోకా గార్డెన్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. జేకే రోడ్‌లోని ఫోక్స్‌వ్యాగన్ షోరూమ్‌లో ఏడాదిగా పనిచేస్తున్నాడు.
షోరూమ్‌లో పనిచేస్తూ అక్కడి కార్యకలాపాలపై అవగాహన పెంచుకున్న గజేంద్ర సునాయాసంగా ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ కారును (రూ.23 లక్షలు) చోరీ చేశాడు. కారు కనిపించకపోవడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీని పరిశీలించగా నిందితుడి ముఖం స్పష్టంగా కనిపించలేదు. అయితే, కారులోని జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా వాహనం జాడకనుక్కుని వెళ్లగా అక్కడ నిందితుడి భార్య డ్రైవింగ్ సీటులో కనిపించింది. పోలీసులను చూడగానే ఆమె అక్కడి నుంచి పరారైంది. లగ్జరీ కార్లలో తిరగాలని ముచ్చపడే భార్యను సంతోషపెట్టేందుకే గజేంద్ర ఈ చోరీ చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆన్‌లైన్ టాస్కుల పేరుతో రూ.12.56 లక్షలు స్వాహా!